Suicide | బెట్టింగ్‌లకు బానిసై కోటి రూపాయలు అప్పు చేసిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య..!
Suicide | క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ పట్టణంలో విషాద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Suicide : క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ పట్టణంలో విషాద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబు, రంజిత (23) కు 2020లో వివాహం జరిగింది. అయితే దర్శన్ బాబు బెట్టింగ్ వ్యసనం ఉందని రంజితకు అప్పటికి తెలియదు. 2021లో ఆ వ్యసనాన్ని గుర్తించిన రంజిత వద్దని వారించింది. అయినా దర్శన్ బాబు వినిపించుకోలేదు. బెట్టింగ్ కోసం రూ.1.5 కోట్లు అప్పులు చేశాడు. దాంతో అప్పులు ఇచ్చిన వాళ్ల తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.
దాంతో ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని రూ.66 లక్షల అప్పు తీర్చాడు. కానీ మరో రూ.84 లక్షల అప్పు మిగిలిపోయింది. ఆ అప్పును తీర్చే మార్గం లేకపోవడంతో ఆయన ఇంట్లో ఉండకుండా అప్పులవాళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో అప్పుల వాళ్లు భార్య రంజితను నిదీయడం మొదలుపెట్టారు. సూటిపోటి మాటలతో వేధించారు. దాంతో మనస్తాపం చెందిన రంజిత ఈ నెల 18న ఉరేసుకుని ప్రాణం తీసుకుంది.
ఘటనపై మృతురాలు తండ్రి వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పులవాళ్ల వేధింపులే తన కుమార్తె బలవన్మరణానికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పులు ఇచ్చినవాళ్లే తన అల్లుడిని బలవంతంగా బెట్టింగ్‌కు బానిసను చేశారని ఆరోపించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతురాలికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

