Suchana Seth | బెంగళూరు సీఈవో బ్యాగులో దొరికిన లేఖ.. బాబు హత్య కేసులో కీలక వివరాలు వెల్లడి..!
Suchana Seth | నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన బెంగళూరు సీఈవో సుచనా సేథ్ బ్యాగులో ఓ నలిగిపోయిన లేఖ లభించిందని శుక్రవారం గోవా పోలీసులు తెలిపారు. కొడుకు బాగుగులు చూసే విషయంలో ఆందోళనే ఆమెను ఆ దారుణ హత్యకు పురిగొల్పినట్లు అర్థమవుతున్నదని పోలీసులు వెల్లడించారు.
Suchana Seth: నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన బెంగళూరు సీఈవో సుచనా సేథ్ బ్యాగులో ఓ నలిగిపోయిన లేఖ లభించిందని శుక్రవారం గోవా పోలీసులు తెలిపారు. కొడుకు బాగుగులు చూసే విషయంలో ఆందోళనే ఆమెను ఆ దారుణ హత్యకు పురిగొల్పినట్లు అర్థమవుతున్నదని పోలీసులు వెల్లడించారు. అయితే కేసు దర్యాప్తు సాగుతున్నందున ఆ లేఖలో ఏమున్నదో ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు.
ఐ లైనర్‌తో టిష్యూ పేపర్‌తో రాసిన నోట్ నిందితురాలు సుచనా సేథ్ బ్యాగులో లభ్యమైందని కేసు దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆ నోట్‌ను తాము బయటపెట్ట దల్చుకోలేదని, బాబు బాగోగుల విషయంలో నెలకొన్న ఆందోళనే ఆమెను నేరానికి పురిగొల్పిందనే విషయం మాత్రం స్పష్టమవుతున్నదని ఆయన చెప్పారు.
కాగా, ఉత్తరగోవాలోని కండోలిన్ అపార్టుమెంటులో ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ (39) తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసింది. ఆమెకు, ఆమె భర్తకు గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో వారు విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. అనంతరం బాలుడి మృతదేహాన్ని బ్యాగులో కుక్కి బెంగళూరు తీసుకెళ్తుండగా గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

