samosas | సీఎం కోసం ఉంచిన సమోసాలు మాయం.. సీఐడీ దర్యాప్తుపై వివాదం
samosas | సీఎం కోసం ఉంచిన సమోసాలు మాయమయ్యాయి. సీఎం భద్రతా సిబ్బందికి వాటిని సర్వ్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఐడీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
సిమ్లా: సీఎం కోసం ఉంచిన సమోసాలు (samosas) మాయమయ్యాయి. సీఎం భద్రతా సిబ్బందికి వాటిని సర్వ్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఐడీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 21న సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులతో కలిసి ఆయన టీ తాగారు. అయితే సీఎంకు సర్వ్ చేసేందుకు ప్రత్యేకంగా ఉంచిన మూడు బాక్సుల సమోసాలు మాయమయ్యాయి. దీంతో సీఐడీ అధికారులు గందరగోళానికి గురయ్యారు.
కాగా, సీఐడీ కార్యాలయంలోని మహిళా అధికారిణి ఆ సమోసాల బాక్సులను సీఎం భద్రతా సిబ్బందికి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీఎం కోసం ఉంచిన ఆ సమోసాలు వారు తిన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఐడీ అంతర్గత దర్యాప్తు జరుపుతోంది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతిపక్షమైన బీజేపీ దీనిపై విమర్శలు గుప్పించింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కోసం ఉంచిన సమోసాలు మాయం కావడంపై సీడీఐ దర్యాప్తు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఆరోపించింది.
అయితే సీఐడీ దీనిని ఖండించింది. కేవలం అంతర్గతంగా ఆరా తీసినట్లు సీఐడీ డీజీ తెలిపారు. సీఎంవో కార్యాలయం కూడా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టింది. బీజేపీకి ఏ సమస్యలు కనిపించకపోవడంతో ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని మీడియా ప్రధాన సలహాదారుడు నరేష్ చౌహాన్ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CID
- Himachal CM
- Probe
- Samosas
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

