JP Nadda | ఎట్టకేలకు దొరికిన జేపీ నడ్డా సతీమణి కారు.. ఎక్కడో తెలుసా?
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.
న్యూఢిల్లీ: దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నడ్డా సతీమణి మళ్లికా ఫార్చునర్ ఎస్యూవీ కారు మార్చి 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అపహరణకు గురైన విషయం తెలిసిందే. కారు డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీసింగ్ సెంటర్ నుంచి తీసుకొచ్చారు.
నడ్డా నివాసానికి చేరుకునే క్రమంలో మధ్యలో తన ఇంటి వద్ద భోజనం కోసం కారును బయట నిలిపి ఉంచారు. ఆ సమయంలో దుండగులు కారును అపహరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినపుడు ఈ కారు గురుగ్రామ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. సుమారు 20 రోజుల తర్వాత దానిని వారణాసిలో పట్టుబడింది.
ఫరిదాబాద్ సమీపంలోని బధ్కల్కు చెందిన షాహిద్, షివంగ్ త్రిపాఠి ఆ కారును వారణాసికి తీసుకొచ్చినట్లు తెలిపారు. భద్కల్లో కారు నంబర్ ప్లేట్‌ను మార్చారని, అలీగఢ్, లఖింపూర్ ఖేరి, బరేలీ, సీతాపూర్, లక్నో మీదుగా వారణాకి వచ్చారని చెప్పారు. దానిని నాగాలాండ్‌కు తరలించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Delhi
- Faridabad
- Fortuner SUV
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

