Supreme Court | స్టే ఆర్డర్ ఆటోమెటిక్‌గా రద్దు కాదు: సుప్రీంకోర్టు
సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. రాజ్యాంగ న్యాయస్థానాలు (సుప్రీంకోర్టు, హైకోర్టులు) సాధారణంగా కింది కోర్టుల్లో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది.
Supreme Court | న్యూఢిల్లీ: సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. రాజ్యాంగ న్యాయస్థానాలు (సుప్రీంకోర్టు, హైకోర్టులు) సాధారణంగా కింది కోర్టుల్లో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణను ముగించడానికి గడువును కింది కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు నిర్ణయించవచ్చునని తెలిపింది.
కేసుల విచారణకు ప్రాధాన్యమిచ్చే విషయాన్ని ఆ కేసులు ఏ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయో, అదే కోర్టు విచక్షణకు వదిలిపెట్టడం ఉత్తమమని వివరించింది. 2018లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఓ కేసులో ఇచ్చిన తీర్పును తాజా తీర్పు కొట్టి వేసింది. కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన స్టే ఉత్తర్వులు, ప్రత్యేకంగా పొడిగించకపోతే, వాటంతట అవే రద్దవుతాయని త్రిసభ్య ధర్మాసనం అప్పట్లో తీర్పు చెప్పింది. స్టే ఆర్డర్ మంజూరైన తర్వాత ఆరు నెలలు ముగిసిన అనంతరం విచారణ లేదా ప్రొసీడింగ్స్ నిలిచిపోబోవని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చే స్టే ఆర్డర్‌కు ఇది వర్తించదని వివరించింది. ఈ తీర్పుతో ఏకీభవించేది లేదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

