అసాధారణ పరిస్థితుల్లో తప్ప బెయిల్‌ను అడ్డుకోవద్దు
ట్రయల్ కోర్టులు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులపై అసాధారణమైన పరిస్థితుల్లో తప్ప హైకోర్టులు స్టే విధించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. హవాలా కేసులో నిందితునికి మంజూరైన బెయిల్‌పై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు మంగళవారం తొలగించింది.
- హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 23: ట్రయల్ కోర్టులు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులపై అసాధారణమైన పరిస్థితుల్లో తప్ప హైకోర్టులు స్టే విధించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. హవాలా కేసులో నిందితునికి మంజూరైన బెయిల్‌పై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు మంగళవారం తొలగించింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ.. అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టులు బెయిల్‌పై స్టే విధించాలని పేర్కొన్నారు. ‘బెయిల్‌పై స్టే విధించే అధికారం కోర్టులకు ఉండవచ్చు. కానీ అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే ఆ అధికారాన్ని వినియోగించాలి. సాధారణమైన పరిస్థితుల్లో బెయిల్‌ను అడ్డుకోరాదు’ అని అన్నారు. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై సరైన కారణాలు తెలుపకుండానే ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై సుప్రీంకోర్టు ఈ నెల 11న అసంతృప్తి వ్యక్తంచేసింది. గత ఏడాది జూన్‌లో మంజూరైన బెయిల్‌పై ఏడాది కాలంగా ఎందుకు స్టే విధించారని ప్రశ్నించింది. ఈ కేసులో వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించారంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు మంజూరుచేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

