పొడిగింపులు.. సడలింపులు

- లాక్‌డౌన్‌పై రాష్ర్టాలు ఆచితూచి నిర్ణయం
- పొడిగించిన బెంగాల్, పంజాబ్, కర్ణాటక
- సడలిస్తున్న ఢిల్లీ, గుజరాత్, హర్యానా
- ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా పరిస్థితులు
న్యూఢిల్లీ, మే 27: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్‌డౌన్‌పై రాష్ర్టాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పలు రాష్ర్టాలు లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గుచూపుతుండగా, మరికొన్ని రాష్ర్టాలు ఆంక్షలను దశలవారీగా సడలిస్తున్నాయి.
- కేసులు పెరుగుదల దృష్ట్యా లాక్‌డౌన్‌ను జూన్ 15వరకు పొడిగిస్తున్నట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. బెంగాల్లో ఏప్రిల్ 30న విధించిన లాక్డౌన్ ఈ నెల 30తో అది ముగియనున్నది. లాక్డౌన్లో మాల్స్, మార్కెట్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్ మొదలైనవి మూసే ఉంటాయని అధికారులు తెలిపారు.
- హర్యానాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జూన్ 1 నుంచి 9-12 తరగతులకు బడులు తెరువాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీచేసింది. బెంచ్‌కి ఒక విద్యార్థే కూర్చోవాలని సూచించింది. సామాజిక దూరం, మాస్క్ ధరించడం తదితర కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టంచేసింది.
- పంజాబ్ ప్రభుత్వం కరోనా ఆంక్షలను జూన్ 10 వరకు పొడిగించింది. అయితే కొన్ని సడలింపులు ఇచ్చింది. దవాఖానల్లో ఓపీడీ సేవలకు అనుమతిచ్చింది.
- మహారాష్ట్రలో 21 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు పదిశాతానికంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జూన్ 1 తర్వాత రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలను ఎత్తివేసే అవకాశం లేదని ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలను సడలించనున్నట్టు చెప్పారు. ఒకేసారి అన్ని చోట్లా ఆంక్షలను ఎత్తివేయడం సరికాదని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.
- దేశరాజధాని ఢిల్లీలో ఈ నెల 31వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. కేసుల తగ్గుదల కొనసాగితే జూన్ 1 నుంచి దశలవారీగా అన్‌లాక్ ప్రక్రియ చేపడుతామని పేర్కొన్నారు.
- కర్ణాటకలో జూన్ 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు.
- గుజరాత్లో కరోనా కేసుల తగ్గుదల నేపథ్యంలో రాత్రికర్ఫ్యూ సమయాన్ని గంట తగ్గించారు.
- కేరళ, తమిళనాడు, మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఏపీ, జమ్ముకశ్మీర్‌లలో ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ లేదా ఆంక్షలు కొనసాగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

