Stalin | తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు : స్టాలిన్
విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే (TVK) ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు : ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే (TVK) ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు లేక అస్థిరంగా ఉందని, ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నందున డీఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోవచ్చుఅని, డీఎంకే పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు.
సొంతంగా 107 సీట్లు సాధించిన టీవీకే మిత్రపక్షమైన కాంగ్రెస్ 5 సీట్లు, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 సీట్లు సాధించిన డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న తమ మిత్రపక్షాలైన వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ మద్దతు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా, లేదా తమిళనాడు స్పీకర్ గానీ, కోర్టులు గానీ రెబెల్ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను చివరికి అనర్హులుగా ప్రకటించినా రాజకీయ అస్థిరత ఏర్పడవచ్చని పేర్కొన్నారు.
గతంలో ఎన్నికల పరాజయాల నుండి డీఎంకే ఎలా పుంజుకుందో గుర్తు చేశారు. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఓటమి తాత్కాలికమైందని, తాము మళ్లీ విజయం సాధిస్తామని కార్యకర్తలకు భరోసానిచ్చారు. తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు” అని స్టాలిన్ స్పష్టం చేశారు. ఓటమికి వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానని,
సోషల్ మీడియాలో పార్టీపై వచ్చే విమర్శలను తిప్పికొట్టాలన్నారు. ఈ విషయంలో టీవీకే చాలా ముందుందని పరోక్షంగా సూచించారు. ఒకప్పుడు మనం టీ దుకాణాల్లో మాట్లాడిన రాజకీయాలను ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై మాట్లాడాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

