NEET | నీట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వండి.. అసెంబ్లీలో స్టాలిన్ బిల్లు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( NEET ) నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీలో సోమవారం బిల్లు ప్రవేశపెట్టారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( NEET ) నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీలో సోమవారం బిల్లు ప్రవేశపెట్టారు. ఇవాళ నేను NEETకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాను. మీరు కూడా గతంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందుకే ఈ తీర్మానానికి మద్దతివ్వాల్సిందిగా ప్రతిపక్షాన్ని కోరుతున్నాను అని ఈ సందర్భంగా స్టాలిన్ అన్నారు. అయితే ప్రతిపక్ష అన్నా డీఎంకే మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
అయితే తమిళనాడులో NEET జరుగుతుందా లేదా తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారని, చివరికి విద్యార్థి ఆత్మహత్య గురించి కూడా అసెంబ్లీలో చర్చించనివ్వలేదని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు. NEETపై డీఎంకే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించలేదని విమర్శించారు. NEETను రద్దు చేస్తారనుకొని విద్యార్థులు ఆ పరీక్షకు సిద్ధం కాలేదు. ఆ విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం. అయితే నీట్ తీర్మానానికి మద్దతిస్తున్నాం అని పళనిస్వామి అన్నారు. NEETకు హాజరు కావాల్సిన ఓ విద్యార్థి.. పరీక్షకు కొన్ని గంటల ముందు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

