Ayodhya Ram Mandir | శ్రీరాముని ఆభరణాలు అదరహో.. ప్రత్యేకత ఏంటంటే..
బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు.
Ayodhya Ram Mandir | అయోధ్య: బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు. ఏనుగు, గుర్రం, ఒంటె, బండి వంటివాటిని పెట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ వివరాలను వెల్లడించింది.
కిరీటం: బాల రాముడు ధరించిన బంగారు కిరీటంలో సూర్య దేవుని బొమ్మ ఉంది. ఈ కిరీటంలో వజ్రాలు, పచ్చ రాళ్లు, మరకత, మాణిక్యాలను పొదిగారు. దీనిని ఉత్తర భారత దేశ సంప్రదాయంలో తయారు చేశారు. కిరీటం కుడివైపున ముత్యాల దండలను వేలాడదీశారు.
కౌస్తుభ మణి: బాల రాముని హృదయ భాగంలో ఉంచిన కౌస్తుభ మణిని కెంపులు, వజ్రాలతో అలంకరించారు. విష్ణుమూర్తి అవతారాలన్నిటిలోనూ ఇది కనిపిస్తుంది.
విజయమాల: బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఇది చాలా పొడవైనది. కెంపులు పొదిగిన ఈ హారం విజయానికి చిహ్నంగా నిలుస్తుంది. వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం దీనిలో ఉన్నాయి.
కంఠాభరణం: అర్ధ చంద్రాకారంలో ఉన్న మరొక హారంలో అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లు ఉన్నాయి. మధ్య భాగంలో సూర్య దేవుని బొమ్మ ఉంది. ఈ హారాన్ని కంఠాభరణం అంటారు. నడుముకు అమర్చిన ఆభరణంలో వజ్రాలు, మరకత, మాణిక్యాలు, కెంపులను పొదిగారు. వజ్రాలు, పచ్చరాళ్లు, ముత్యాలను పొదిగిన పాదిక అనే హారాన్ని నాభి వద్ద అలంకరించారు. అదేవిధంగా భుజకీర్తులు, మండ గొలుసులు, ఉంగరాలను కూడా బాల రామునికి ధరింపజేశారు. బాల రాముని కాళ్లకు కడియాలు, కాలి వేళ్లకు చుట్లు పెట్టారు. వీటన్నిటిలోనూ వజ్రాలు, కెంపులను పొదిగారు. ముత్యాలు, పచ్చ రాళ్లు పొదిగిన బంగారు విల్లు, ఓ బాణం కూడా బాల రాముని చేతుల్లో ఉన్నాయి. వజ్రాలు, కెంపులతో వెండి-ఎరుపు రంగుల్లో నుదుటిపై తిలకాన్ని పెట్టారు. వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, రామచరితమానస్ వంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసి ఈ ఆభరణాలను తయారు చేయించినట్లు ట్రస్ట్ వెల్లడించింది.
పసుపు రంగు పంచె, ఎరుపు రంగు అంగ వస్ర్తాలను బెనారస్ వస్ర్తాలతో తయారు చేయించారు. వీటిపైన శంఖం, పద్మం, చక్రం, నెమలి బొమ్మలు ఉన్నాయి. ఆకర్షణీయమైన జరీ అంచులు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

