రామ్‌పూర్(యూపీ), జూలై 15: విద్వేష ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పునిచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దమరా ప్రాంతంలో ఖాన్ విద్వేష ప్రసంగం చేశారని కేసు నమోదైంది.
యూపీలోని ఘోసీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ తన శాసన సభ సభ్వత్వానికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను ఆయన వెల్లడించలేదు.