నడిరోడ్డుపై మహిళ చీర లాగిన బీజేపీ కార్యకర్తలు.. వీడియో వైరల్
బీజేపీ | ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బ్లాక్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష

లక్నో : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బ్లాక్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. లఖింపూర్‌ఖేరీ జిల్లాలోని పాస్గ్వాన్ బ్లాక్ నుంచి బరిలో ఉన్న ఎస్పీ మహిళా నాయకురాలు రీతూ సింగ్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బయల్దేరింది.
ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఆమెను నడిరోడ్డుపై అడ్డగించారు. అంతటితో ఆగకుండా రీతూ సింగ్ చీరను లాగారు. నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేశారు. ఈ తతంగాన్ని కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. యోగి ప్రభుత్వం గుండాగిరి చేస్తుందని మండిపడ్డారు. అయితే మహిళపై దాడి వెనుక స్థానిక బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారని ఎస్పీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత మహిళ రీతూ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
— Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

