భారత్‌లో కనిపించని లాంబ్డా స్ట్రెయిన్ ఆనవాళ్లు!

న్యూఢిల్లీ : భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరంగా భావిస్తున్న లాంబ్డా స్ట్రెయిన్‌ను దేశంలో ఇప్పటివరకూ గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు. గత నాలుగు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో ఆందోళనకరమైన వేరియంట్‌గా పరిగణిస్తున్న లాంబ్డా స్ట్రెయిన్‌ను కనుగొన్నారని బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధిక మరణాల రేటు నమోదైన పెరూలో ఈ స్ట్రెయిన్ పుట్టుకొచ్చిందని బ్రిటన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
గత ఏడాది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించినప్పటి నుంచి డెల్ట్రా స్ట్రెయిన్ ఆందోళనకరమైన వేరియంట్‌గా భావిస్తుండగా ఇది అంతకంటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. లాంబ్డా స్ట్రెయిన్ బ్రిటన్‌కూ వ్యాప్తి చెందిందని ఈ తరహా కేసులు ఆరు వెలుగుచూశాయని అధికారులు తెలిపారు.
డెల్టా వేరియంట్ కంటే లాంబ్డా స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని పాన్ అమెరికన్ ఆరోగ్య సంస్థ పరిశోధకులు పేర్కొన్నారు. పెరూలో మే, జూన్‌లో నమోదైన కేసుల్లో 82 శాతం లాంబ్డా స్ట్రెయిన్‌కు చెందినవేనని వారు వెల్లడించారు. లాంబ్డా వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా యాంటీబాడీల తటస్థీకరణను నిరోధిస్తుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

