సోనూసూద్ మరో ముందడుగు.. ఈసారి వ్యాక్సినేషన్ లక్ష్యంగా..

ముంబై: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా విపత్తు వేళ తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నాడు. ఇన్నాళ్లూ కరోనా వల్ల కష్టాలు పడిన వారికి అండగా నిలిచిన ఈ రియల్ హీరో.. ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాడు. ముఖ్యంగా గ్రామీణ భారతానికి వ్యాక్సినేషన్లో అండగా ఉండటానికి ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించాడు. దాని పేరు COVREG. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్ల కోసం గ్రామీణులు రిజిస్టర్ చేసుకోవడంలో సాయం చేయడానికి వలంటీర్లు ఉంటారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ల సమస్యలను పరిష్కరించడానికే తాను ఈ COVREG కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సోనూ ఓ ప్రకటనలో చెప్పాడు. ఈ COVREGను కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదించింది. ఇదొక అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్‌గా గుర్తించింది. ఓ స్మార్ట్‌ఫోన్, 4జీ నెట్వర్క్ ఉన్న ఎవరైనా www.covreg.inలో రిజిస్టర్ చేసుకొని వలంటీర్‌గా మారొచ్చని సోనూ సూద్ చెప్పాడు.
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌లో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వలంటీర్లు సాయం చేస్తారని తెలిపాడు. ఈ మహమ్మారిని జయించాలంటే వ్యాక్సినేషనే మన ముందున్న మార్గమని అతడు స్పష్టం చేశాడు. క్షేత్రస్థాయిలో గ్రామీణ భారతం కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించిన తర్వాతే ఈ covregను క్రియేట్ చేసినట్లు సోనూ చెప్పాడు.
వలంటీర్లు చేయాల్సిన పని
- వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించడం. దీనికి సంబంధించిన ప్రశ్నలు/అపోహలకు సమాధానాలివ్వడం
- వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్, స్లాట్లు బుక్ చేయడంలో సాయం
- రిజిస్టర్ చేసుకున్న వారిని వ్యాక్సినేషన్ సెంటర్లకు తరలించడం
- రెండో డోసు కోసం కూడా రిజిస్టర్ చేసుకోవడం, స్లాట్లు బుక్ చేయడం
- వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అందించడం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

