Sonia Gandhi: గంగా రామ్ హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ
Sonia Gandhi :ఊపిరితిత్తుల సమస్యతో సోనియా బాధపడుతున్నారు. బ్రాంకైటీస్ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్లో ఆమెను చేర్పించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత సోనియా గాంధీ(Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్(Ganga Ram Hosptial)లో చేర్పించారు. బ్రాంకైటీస్(Bronchitis) వ్యాధికి సోనియా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమె హాస్పిటల్లో చేరడం ఇది రెండవసారి. జనవరిలో కూడా శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడ్డారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పలుమార్లు ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.
జ్వరం వల్ల సోనియాను హాస్పిటల్లో చేర్పించినట్లు ట్రస్టు సొసైటీ చైర్మెన్ డీఎస్ రాణా తెలిపారు. చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్ అరూప్ బాసు నేతృత్వంలో చికిత్స సాగుతోందన్నారు. ఆమె కండీషన్ ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

