Sonia Gandhi | ఆ ఏడాది రాహుల్‌గాంధీ పుట్టినరోజుకు ఎవరూ రాలేదు : సోనియాగాంధీ
Sonia Gandhi | అప్పట్లో రాజకీయాల ప్రభావం తమపైనే కాకుండా తమ పిల్లలపైనా ఉండేదని కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) గుర్తుచేసుకున్నారు. అందుకు సంబంధించిన విషయాలను తన ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ లో నెమరు వేసుకున్నారు.
Sonia Gandhi : అప్పట్లో రాజకీయాల ప్రభావం తమపైనే కాకుండా తమ పిల్లలపైనా ఉండేదని కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) గుర్తుచేసుకున్నారు. అందుకు సంబంధించిన విషయాలను తన ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ లో నెమరు వేసుకున్నారు. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ (Indira Gandhi) ఓడిపోయిన తర్వాత అప్పటివరకు తమతో సన్నిహితంగా ఉన్న చాలామంది వ్యక్తులు క్రమంగా తమను దూరం పెట్టడం ప్రారంభించారని తెలిపారు.
ఇలాంటి చర్యలు చిన్నారులైన తమ పిల్లలు రాహుల్, ప్రియాంకలను ఎంతగానో బాధించాయని సోనియాగాంధీ తెలిపారు. ఇందిరాగాంధీ ఓడిపోయిన సమయంలోనే రాహుల్‌గాంధీ పుట్టినరోజు రావడంతో ఇంట్లోనే వాడి స్నేహితులను పిలిచి చిన్న పార్టీ జరపడానికి ఏర్పాట్లు చేశామని, కానీ ఆ పుట్టినరోజుకు రాహుల్ ప్రాణ స్నేహితుడు సిద్ధార్థ్ ఒక్కడే వచ్చాడని వెల్లడించారు. ఇతర స్నేహితులెవరూ రాలేదని, ఏదో పొరపాటువల్ల పిల్లలు రాలేదని భావించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేశామని, అయితే వారు ఉద్దేశపూర్వకంగానే తమ పిల్లలను మా ఇంటికి పంపనట్లు తెలుసుకొని షాక్ అయ్యానని పేర్కొన్నారు.
ఏడేళ్ల చిన్నారికి స్నేహితులతో ఉన్న బంధం రాజకీయాలవల్ల కలుషితమైపోయిందని తెలిసి బాధపడ్డామని, ఈ ఘటనతో రాహుల్ తీవ్ర మనస్తాపానికి గురవడంతో అత్తమ్మ, రాజీవ్ ఓదార్చారని సోనియా వెల్లడించారు. మానవ సంబంధాల విషయంలో అదే రాహుల్ నేర్చుకున్న తొలి బాధాకరమైన పాఠమని పేర్కొన్నారు. అది అంతటితో ఆగలేదని, స్కూల్లోనూ అత్తమ్మ, రాజీవ్‌లపై తోటి విద్యార్థులు చేసే వ్యాఖ్యలు విని రాహుల్, ప్రియాంక చాలా బాధ పడేవారని తెలిపారు. ఆ సమయంలో వారిని ఓదార్చి మా కుటుంబసభ్యులు దేశం కోసం ఎంత శ్రమించారో వివరించేదానినని వెల్లడించారు.
1978 నవంబర్‌లో చిక్కమగళూరు ఉప ఎన్నికల్లో ఇందిరాగాంధీ విజయం సాధించిన తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చిందని సోనియాగాంధీ తెలిపారు. 1980 జూన్‌లో పిల్లలకు సెలవులు ఉండడంతో తాను రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకలను తీసుకొని ఇటలీలోని మా అమ్మగారింటికి వెళ్లామని పేర్కొన్నారు. పిల్లలను ఓర్బాస్సానోలో ఉన్న తన తల్లిదండ్రుల వద్ద వదిలి తాము ఫ్లోరెన్స్ ప్రాంతానికి వెళ్లామని తెలిపారు. జూన్ 23న మా అమ్మకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని, అవతలి వ్యక్తి ఏం చెబుతున్నారో అర్థం కాకపోవడంతో ఆమె ఫోన్‌ను పదేళ్ల రాహుల్‌కు ఇచ్చిందని పేర్కొన్నారు.
ఫోన్ చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్కే ధావన్ అని, సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయాడని ఆయన రాహుల్‌కు చెప్పగానే తాను విన్న విషయాన్ని నమ్మలేకపోయాడని సోనియాగాంధీ తెలిపారు. రాహుల్ వెక్కివెక్కి ఏడుస్తూ బాబాయ్ చనిపోయాడని ఇటాలియన్లో పదేపదే చెప్పాడని, ఆ వార్త వినగానే రాజీవ్ షాక్‌తో నిశ్చేష్ఠులయ్యారని, ఆయనను, రాహుల్‌ను ఓదార్చడం ఎవరితరం కాలేదని పేర్కొన్నారు. తాము ఇటలీ వెళ్లడానికి ముందే విమానాన్ని నడిపే విషయంలో సంజయ్‌ను రాజీవ్ హెచ్చరించారని తెలిపారు.
అవసరమైనంత ప్రాథమిక శిక్షణ లేకుండా విమానాన్ని నడపడంలో తొందరపడవద్దని రాజీవ్ సూచించారని సోనియాగాంధీ తెలిపారు. అయినప్పటికీ విమానాన్ని నడిపి ప్రమాదానికి గురయ్యారన్నారు. సంజయ్ చనిపోయిన సమయానికి ఆయన భార్య మేనకా గాంధీకి 23 ఏళ్లేనని, అప్పటికి కేవలం మూడు నెలల వయసున్న అతడి కుమారుడు వరుణ్ గాంధీ తండ్రిలేని వాడవ్వడం అందరినీ కలిచివేసిందని సోనియాగాంధీ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఆ ఏడాది రాహుల్‌గాంధీ పుట్టినరోజుకు ఎవరూ రాలేదు : సోనియాగాంధీ
Pyre | ఆస్కార్ రేసులో మరో భారతీయ చిత్రం.. ఇండిపెండెంట్ రూట్లో ప్రయాణిస్తున్న ‘పైర్’!
Niranjan Reddy | వనపర్తి ఇరిగేషన్ సీఈ ఆఫీస్ ఎదుట రైతులతో నిరంజన్ రెడ్డి ధర్నా.. వీడియో
‘నిరుపేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు అభినందనీయం’
‘సీతారామ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాల్వలు వెంటనే నిర్మించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

