తొలిచూపులోనే రాజీవ్‌తో ప్రేమలో పడ్డా..
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' మంగళవారం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఆత్మకథలోని కీలక అంశాలు ఆమె మాటల్లోనే.. ‘కేంబ్రిడ్జ్‌లో రాజీవ్‌తో తొలిపరిచయం ఏర్పడింది.
- నా అభ్యర్థిత్వాన్ని కలాం అడ్డుకున్నారన్నది అవాస్తవం
- ఆత్మకథలో సోనియా గాంధీ
న్యూఢిల్లీ, నవంబర్ 10 : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ మంగళవారం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఆత్మకథలోని కీలక అంశాలు ఆమె మాటల్లోనే.. ‘కేంబ్రిడ్జ్‌లో రాజీవ్‌తో తొలిపరిచయం ఏర్పడింది. వర్సిటీ రెస్టారెంట్లో ఆయనను తొలిసారి చూసి ప్రేమలో పడ్డా. ఆ సమయంలో రాజీవ్ వయసు 21 ఏండ్లు. 1975లో ఎమర్జెన్సీ విధించే ముందు మా అత్తగారు ఇందిరా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజీనామా చేయమని రాజీవ్ సూచించగా, గట్టిగా ఎదుర్కోవాలని ఆయన సోదరుడు సంజయ్ గాంధీ అభిప్రాయపడ్డారు. న్యాయనిపుణులు, అప్పటి మంత్రులతో సంప్రదింపులు తర్వాతే మా అత్తగారు ఎమర్జెన్సీ విధింపుపై నిర్ణయం తీసుకున్నారు. 2004లో యూపీఏ కూటమి విజయం సాధించిన తర్వాత నా విదేశీయత కారణంగా నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తిరస్కరించారన్న దానిలో వాస్తవం లేదు.
2004 లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రధాని పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నా.. ఆ విషయం రాహుల్, ప్రియాంకలతో కూడా చర్చించా. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతల ఒత్తిడితో ప్రధాని పదవికి సరేనన్నా. ఇది తెలిసి రాహుల్, ప్రియాంక నా నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. మరుసటి రోజు నా అసలు నిర్ణయానికే కట్టుబడి ఉంటానని రాహుల్‌కు చెప్పా. యూపీఏ హయాంలో సమాంతర అధికార కేంద్రం నడిపానన్నది నిజం కాదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడుపగా, పార్టీ వ్యవహారాలు నేను చూసుకున్నా. పార్టీలోని సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని కావాలన్న ఆకాంక్ష చాలాకాలంగా ఉంది. ‘పైస్థాయిలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందేమో’ అన్న ఆయన వ్యాఖ్యను ప్రధాని పదవిపై ఆసక్తికి సంకేతంగా భావించా. అయితే ఈ అంశంపై చర్చను పొడిగించకుండా మరోవైపు మళ్లించా. ప్రధాని మోదీతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఎదురుపడినప్పుడు ఆయన నా కళ్లలోకి చూడకుండా పక్కకు చూపు తిప్పుకుంటారు’ అని ఆమె వివరించారు. సోనియా తన ఆత్మకథకు వైట్ వాషింగ్ (తప్పులను కప్పిపుచ్చడం) అని పేరు పెట్టాల్సిందని బీజేపీ విమర్శించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

