Hybrid Solar Eclipse | 20న అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
Hybrid Solar Eclipse | ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు ఖగోళ ప్రియులను కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మరో రెండు చంద్రగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడబోతున్నది. ఈ గ్రహణానికి ప్రత్యేకత ఉండగా.. దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు హైబ్రిడ్ సూర్యగ్రహణంగా పేర్కొంటున్నారు.
Hybrid Solar Eclipse | ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు ఖగోళ ప్రియులను కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మరో రెండు చంద్రగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడబోతున్నది. ఈ గ్రహణానికి ప్రత్యేకత ఉండగా.. దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు హైబ్రిడ్ సూర్యగ్రహణంగా పేర్కొంటున్నారు. ఒకే రోజు మూడు రకాల సూర్యగ్రహణాలు కనిపించనుండడంతో ‘హైబ్రిడ్’ గ్రహణంగా పేర్కొంటున్నారు. ఈ గ్రహణాన్ని నిగలు సూర్యగ్రహణం, శంకర సూర్యగ్రహణం లేదంటే కంకణాకార సూర్యగ్రహణం అని కూడా పిలుస్తుంటారు.
ఈ నెల 20న ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 1.29 గంటల వరకు కొనసాగనున్నది. అయితే, ఈ సూర్యగ్రహణం భారత్‌లో మాత్రం కనిపించదని జాతీయ అవార్డు గ్రహీత సైన్స్ బ్రాడ్‌కాస్టర్ సారిక తెలిపారు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూ గినియా తదితర దేశాల్లో మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ ఆస్ట్రేలియాలోని నార్త్ వెస్ట్ కేప్‌లో దర్శనమిస్తుంది. ఇక హైబ్రిడ్ సూర్యగ్రహణం చివరిసారిగా 2013లో దర్శనమిచ్చింది. మళ్లీ దాదాపు 140 సంవత్సరాల తర్వాత మాత్రమే కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హైబ్రిడ్ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుడు అడ్డుకుంటాడు.
చంద్రుని నీడ భూమి ఉపరితలంపై కదులుతున్న సమయంలో ఈ గ్రహణం.. సంపూర్ణ సూర్యగ్రహణం నుంచి కంకణాకార (రింగ్ ఆకారంలో)కి మారుతుంది. ఈ గ్రహణాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఆస్ట్రేలియాలోని గ్రావిటీ డిస్కవరీ సెంటర్ అండ్ అబ్జర్వేటరీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అయితే, ఈ అరుదైన సూర్యగ్రహణంలో ప్రపంచంలోని నాలుగు లక్షల మంది కంటే తక్కువ మంది, సంపూర్ణ గ్రహణం లేదంటే.. కంకణాకార గ్రహణాన్ని చూడగలుగుతారని సారిక చెప్పారు. దాదాపు 700 మిలియన్ల మంది పాక్షిక సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం ఉందన్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం ఆస్ట్రేలియా ఎక్స్‌మౌత్ ద్వీపకల్పంలో కేవలం ఒకే ఒక నిమిషం మాత్రమే కనిపిస్తుందని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

