Ring of Fire | రేపు ఆకాశంలో రింగ్ ఆఫ్ ఫైర్.. ఉంగరం ఆకృతిలో సూర్య వలయం
Ring of Fire | ఈ నెల 14న ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్ ఆఫ్ ఫైర్' (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది.
న్యూఢిల్లీ: ఈ నెల 14న ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది. ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనున్నది. ఈ దేశాల్లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ చివరిసారి 2012లో కనిపించగా, మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు.
దీని తర్వాత 2046 వరకు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఈసారి సూర్యగ్రహణం భారత్ సహా అనేక దేశాల్లో కనిపించటం లేదు. ‘సూర్యగ్రహణం వేళ ఏర్పడే అద్భుతమైన వలయం చూసే అవకాశం అరుదుగా వస్తుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని నాసా సైంటిస్టు పెగ్ లూసి అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 4.30 గంటలకు అంతరిక్షంలో సంభవించే అరుదైన దృశ్యాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

