రాష్ర్టాలకు ‘సహకార’ విజయం

97వ రాజ్యాంగ సవరణలో సొసైటీల భాగాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు
2:1 మెజారిటీతో తీర్పు వెల్లడి
న్యూఢిల్లీ: 97వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు 2:1 మెజారిటీ తీర్పులో సమర్థించినప్పటికీ దానిలో సహకార సంఘాలకు సంబంధించిన భాగాన్ని (పార్ట్ 9బీ) కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. జస్టిస్ జోసెఫ్ మాత్రం రాజ్యాంగ సవరణ మొత్తాన్ని విభేదించారని తీర్పును వెలువరించిన జస్టిస్ నారిమన్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ర్టాలకు పెద్ద విజయం. దేశంలోని కోఆపరేటివ్ సొసైటీల సమర్థ నిర్వహణకు సంబంధించిన అంశాలతో కూడిన 97వ రాజ్యాంగ సవరణను 2011 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. 2012 ఫిబ్రవరి 15నుంచి అమలులోకి వచ్చి ంది. అయితే ఈ సవరణను గుజరాత్ హైకోర్టు 2013లో కొట్టివేసింది. కోఆపరేటివ్ సొసైటీలు రాష్ర్టాల పరిధిలోని అంశమని, వాటికి చట్టాలు చేసే అధికారం కేంద్రానికి లేదని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఆ తీర్పు చెప్పింది. ఆ తీర్పును సుప్రీంకోర్టులో కేంద్రం సవాల్ చేసింది. కేంద్రం తీసుకొచ్చిన ప్రొవిజన్ రాష్ర్టాల అధికారాలను హరిస్తుందా అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ వాదనల్లో భాగంగా కేంద్రం తమ అధికారాల పరిధిలోకి కేంద్రం చొరబడుతున్నదని పలు రాష్ర్టాలు తెలిపాయి. కోఆపరేటివ్ సొసైటీల నిర్వహణలో ఏకత్వాన్ని తీసుకొచ్చేందుకే రాజ్యాంగ సవరణను తీసుకొచ్చామని కేంద్రం తన వాదనను వినిపించింది. అలాంటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 252ను అనుసరించడం ఒక్కటే కేంద్రానికి ఉన్న మార్గమని సుప్రీంకోర్టు సూచిస్తూ ‘పార్ట్ 9బీ’ని కొట్టివేసింది. ఈ ఆర్టికల్ రెండు మూడు రాష్ర్టాల కోసం వాటి సమ్మతితో చట్టాన్ని చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

