సేలం, జూన్ 11: మమతా బెనర్జీ.. సోషలిజం. ఆదివారం తమిళనాడులోని సేలంలో జరుగబోయే వివాహంలో వధూవరుల పేర్లు ఇవి. వరుడి తండ్రి పేరు మోహన్. ఆయన కమ్యూనిస్టు. తన ముగ్గురు కొడుకులకు కమ్యూనిజం, లెనినిజం, సోషలిజం అని పేర్లు పెట్టారు. ముగ్గురిలో సోషలిజం చిన్నవాడు. అతనికి తమ సమీప బంధువు కుమార్తె మమతాబెనర్జీకి ఇచ్చి పెండ్లి చేస్తున్నారు. ఈ బంధువులు కాంగ్రెస్ అభిమానులు. మమత కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో ఆమె పేరును తమ కూతురికి పెట్టారు.