ముంబై: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో అదుపులోకి తీసుకుని గుజరాత్‌లోని అహ్మదాబాద్ తరలించారు.
అహ్మదాబాద్‌లో నమోదైన ఓ కేసులో సెతల్వాద్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాతి రోజునే సెతల్వాద్ అరెస్టు జరుగడం గమనార్హం. పిటిషనర్ జకియాకు సెతల్వాద్ మద్దతుగా ఉన్నారు.