Snow Leopards | దేశంలో 718 మంచు చిరుతలు.. అత్యధికంగా లఢఖ్‌లో..!
Snow Leopards | దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)’ తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలిందని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్’ సమావేశంలో ఈ మేరకు ఆయన ఓ నివేదికను విడుదల చేశారు.
Snow Leopards: దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)’ తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలిందని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్’ సమావేశంలో ఈ మేరకు ఆయన ఓ నివేదికను విడుదల చేశారు.
దేశంలో మంచు చిరుతలు నివసించే 1.20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో (లఢఖ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ ) 70 శాతానికి పైగా ప్రదేశాన్ని ఈ శాస్త్రీయ గణన కవర్ చేసిందని కేంద్రం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లపాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది. మొత్తం 1971 ప్రాంతాల్లో 1.80 లక్షల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు.
మంచు చిరుతల సంఖ్యకు సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నాయి. అందులో అత్యధికంగా లఢఖ్‌లో 447 చిరుతలు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో 124, హిమాచల్‌ప్రదేశ్‌లో 51, అరుణాచల్‌ప్రదేశ్‌లో 36, సిక్కింలో 21, జమ్ము అండ్ కశ్మీర్లో 9 మంచు చిరుతలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

