Pegasus Spyware| పెగాసస్ స్పైవేర్ బారిన పడ్డ జర్నలిస్టులు వీరే!
Pegasus Spyware| పెగాసస్ స్పైవేర్ బారిన పడ్డ జర్నలిస్టులు వీరే! } పెగాసస్ స్పైవేర్ బారిన పడిన 40కి పైగా ఇండియన్ జర్నలిస్ట్ ఫోన్లు హ్యాక్...

న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ బారిన పడిన వారిలో 40 మందికి పైగా ఇండియన్ జర్నలిస్టులు ఉన్నారు. హిందూస్థాన్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శిశిర్ గుప్తాతోపాటు ఇండియా టుడే, నెట్వర్క్ 18, ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది వైర్ సంస్థల టాప్ జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి.
వైర్ జర్నలిస్టులపై నిఘా ఇందుకేనా?
అమిత్‌షా తనయుడు జయ్షా బిజినెస్ లావాదేవీలు, ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త నిఖిల్ మర్చంట్, వ్యాపారవేత్త అజయ్ పిరమల్‌తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లావాదేవీలపై ఇంగ్లిష్ వెబ్సైట్ ది వైర్ పరిశోధనాత్మక కథనాలు రాసింది. రోహిణి సింగ్‌తోపాటు ఇద్దరు వైర్ వ్యవస్థాపక ఎడిటర్లు, ఇద్దరు కంట్రిబ్యూటర్ల కదలికలపై నిఘా పెట్టిందని సమాచారం.
రాఫెల్‌పై ఎక్స్‌ప్రెస్ విలేకరి సుశాంత్ పరిశోధనలు
ఇక వివాదస్పదమైన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం, ఇతర అంశాలపై పరిశోధనలు జరిపిన మాజీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు సుశాంత్ సింగ్‌పై 2018 మధ్యలో పెగాసస్ స్పైవేర్ ప్రయోగించారని తెలుస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలోనూ పెగాసస్ స్పైవేర్ బారిన పడిందని డిజిటల్ ఫోరెన్సిక్ అధ్యయనంలో తేలింది.
Read More: మంత్రుల ఫోన్ హ్యాకింగ్.. అసలేంటీ పెగాసస్ స్పైవేర్? ఎలా హ్యాక్ చేస్తుంది?
ఢిల్లీలో అత్యధిక జర్నలిస్టులపై పెగాసస్ దాడి
ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీలో పని చేస్తున్న జర్నలిస్టులపై ఈ స్పైవేర్ ఉపయోగించారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. హిందూస్థాన్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడటర్ శిశిర్ గుప్తా, ఎడిటోరియల్ పేజీ ఎడిటర్ ప్రశాంత్ షా, డిఫెన్స్ కరస్పాండెంట్ రాహుల్ సింగ్, రాజకీయ వార్తల జర్నలిస్టు ఔరంగజేబు నాస్బండీ, ఒక మింట్ విలేకరిపై స్పైవేర్ ప్రయోగించారని ఆ అధ్యయనం పేర్కొంది.
భద్రతా వ్యవహారాలపై పరిశోధనలకు..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రితికా చోప్రా (ఎడ్యుకేషన్, ఎలక్షన్ కమిషన్), ముజామిల్ జలీల్ (కశ్మీర్ ప్రతినిధి), ఇండియా టుడే ప్రతినిధి సందీప్ ఉన్నిథన్, టీవీ 18 ఇన్వెస్టిగేషన్స్ అండ్ భద్రతా వ్యవహారాల ఎడిటర్ మనోజ్ గుప్తా, హిందూ జర్నలిస్టు విజేత సింగ్‌ల ఫోన్లను ట్రేస్ చేశారు.
Read More: పెగాసస్ టార్గెట్‌లో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్..
ఫ్రీలాన్సర్ స్వాతి చతుర్వేది ఫోన్ కూడా..
ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్లు సిద్ధార్థ్ వరదరాజన్, ఎంకే వేణు ఫోన్లు కూడా పెగాసస్ బారిన పడ్డాయి. సంస్థ డిప్లమాటిక్ ఎడిటర్ దేవిరూప మిత్రా పేరు రికార్డుల్లో కనిపించింది. రాజకీయ, భద్రతా వ్యవహారాలపై పరిశోధనలు జరిపిన రోహిణి సింగ్, సీనియర్ కాలమిస్ట్ ప్రేమ్ శంకర్ ఝా, ఫ్రీలాన్స్ జర్నలిస్టు స్వాతి చతుర్వేది కూడా పెగాసస్ స్పైవేర్ బారిన పడ్డారు.
ఆమ్నెస్టీ, ఫ్రాన్స్ సంస్థ స్వతంత్ర అధ్యయనం ఇలా
భారత్‌తోపాటు వివిధ దేశాల జర్నలిస్టులపై నిఘాకు పెగాసస్ స్పైవేర్ వినియోగంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫ్రాన్స్ స్వచ్ఛంద సంస్థ ఫార్బిడెన్ స్టోరీస్ సంయుక్తంగా స్వతంత్ర ఫోరెన్సిక్ అధ్యయనం జరిపాయి. ది వైర్‌తోపాటు 15 ఇతర వార్తా సంస్థల ప్రతినిధులపై పెగాసస్ నిఘా కొనసాగిందని ఈ పరిశీలనలో తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

