Smriti Irani | అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గృహ ప్రవేశం..!
Smriti Irani | కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి గురువారం అమేథీలో గృహ ప్రవేశం చేశారు.
Smriti Irani | కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి గురువారం అమేథీలో గృహ ప్రవేశం చేశారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమేథీలో ఆమె గృహ ప్రవేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. గత ఎన్నికల్లో తాను గెలిస్తే అమేథీని శాశ్వత ఇంటి అడ్రస్‌గా మార్చుకుంటానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. గాంధీల కుటుంబానికి కంచుకోట అమేథీలో తొలిసారి రాహుల్ గాంధీని ఓడించారు.

2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2021లో అమేథీలో స్మృతి ఇరానీ 15వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేశారు. 2023లో ‘కిచ్డీ బోజ్’ అనే కార్యక్రమం నిర్వహించి, తాజాగా గృహ ప్రవేశం నిర్వహించారు. ఉజ్జయని పూజారి ఆశిశ్ మహరాజ్ ఆధ్వర్యంలో ఆమె గృహ ప్రవేశ వేడుక నిర్వహించారు.
2014 నుంచి రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ పోటీ పడుతున్నారు. 2014లో ఓటమి పాలైనా, 2019లో రాహుల్ గాంధీని ఓడించి సంచలన విజయం సాధించారు. 2004 నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందిన రాహుల్ గాంధీకి 2019 ఎన్నికల్లో ఓటమి పరాభవాన్ని మిగిల్చింది. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ వారు మళ్లీ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

