Watch: చెంపదెబ్బలు, పిడిగుద్దులు, చిరిగిన చొక్కాలు.. దారుణంగా కొట్టుకున్న వ్యాపారులు
Shopkeepers' Fight | షాపు బయట వస్తువులు ఉంచడంపై కొందరు వ్యాపారుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ పెరుగడంతో ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఒకరినొకరు కొట్టుకున్నారు. చొక్కాలు చించుకోవడంతోపాటు చెంపదెబ్బలు, పిడిగుద్దులు కురిపించుకున్నారు.
లక్నో: షాపు బయట వస్తువులు ఉంచడంపై కొందరు వ్యాపారుల మధ్య గొడవ జరిగింది. (Shopkeepers’ Fight) ఘర్షణ పెరుగడంతో ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఒకరినొకరు కొట్టుకున్నారు. చొక్కాలు చించుకోవడంతోపాటు చెంపదెబ్బలు, పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయాలో ఈ సంఘటన జరిగింది. భోలే మందిర్ సమీపంలో ఒక షాపు బయట వస్తువులు ఉంచడంపై అనిల్ కుమార్‌ను పక్కషాపులకు చెందిన పవన్ కుమార్, సన్నీ, లక్కీ నిలదీశారు.
కాగా, వారి మధ్య వాగ్వాదం ముదరడంతో ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆ వ్యాపారులు ఒకరినొకరు కొట్టుకున్నారు. చెంపదెబ్బలు, పిడిగుద్దులు కురిపించడంతోపాటు చొక్కాలు చించుకున్నారు. రోడ్డుపై దొర్లి ఫైట్ చేసుకున్నారు. స్థానికులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
మరోవైపు వ్యాపారి అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పవన్ కుమార్, సన్నీ, లక్కీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2021లో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో చిరు వ్యాపారుల మధ్య జరిగిన ఫైట్‌ను ఇది గుర్తు చేసింది.
सामान दुकान के बाहर रखने को लेकर व्यापारियों का बीच सड़क पर कपड़े फाड़ युद्ध!#viralvideo #औरैया #UP pic.twitter.com/VgzliPJDds
— Social editor (@VishalGupt4492) November 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- fight
- Punches
- shopkeepers
- Slaps
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

