Road Accident | లక్నో : ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.