లోకల్ రైళ్ల నుంచి కిందపడి ఆరుగురి మృతి
మహారాష్ట్రలోని థాణె జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు లోకల్ రైళ్లలో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తుండగా.. పరస్పరం ఢీకొని కిందపడి ఆరుగురు మరణించారు.
- మరో 9 మందికి గాయాలు
- మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన
- కిక్కిరిసిన రైళ్లలో ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా ప్రమాదం
ముంబై, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/ముంబై: మహారాష్ట్రలోని థాణె జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు లోకల్ రైళ్లలో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తుండగా.. పరస్పరం ఢీకొని కిందపడి ఆరుగురు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఉదయం రద్దీ సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ముంబ్రా స్టేషన్ సమీపంలో మలుపు వద్ద దుర్ఘటన జరిగిందని చెప్పారు. బాధితులు రెండు రైళ్లలోని ఫుట్‌బోర్డుపైన వేలాడుతున్నారని రైల్వే సీపీఆర్ఓ స్వప్నిల్ ధన్‌రాజ్ నీలా తెలిపారు. ఒక రైలు కసారా వెళుతుండగా, మరో రైలు ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌కు వెళుతోందని ఆయన చెప్పారు.
ముంబై లోకల్ రైళ్లకు ఆటోమేటిక్ డోర్లు
ఘటన నేపథ్యంలో ముంబైలో కొత్త సబర్బన్ రైళ్లు అన్నిటికీ ఇక ఆటోమేటిక్‌గా తలుపులు మూసుకుపోయే సౌకర్యాన్ని కల్పించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న లోకల్ రైళ్లకు కూడా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రైల్వే బోర్డు సమాచార, ప్రచార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఢిల్లీలో తెలిపారు.
రైల్వే మంత్రి రాజీనామా చేయాలి
రైలు ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం మీద విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

