Madhya Pradesh | భూ వివాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురిని కాల్చి చంపారు..
Madhya Pradesh | భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. రెండు కుటుంబాల మధ్య నెలకొన్న భూ వివాదాలు ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Madhya Pradesh | భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. రెండు కుటుంబాల మధ్య నెలకొన్న భూ వివాదాలు ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. మొరెనా జిల్లాలోని లీపా గ్రామానికి చెందిన ధీర్ సింగ్ తోమర్, గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబాల మధ్య గతంలో భూ వివాదాలు ఉన్నాయి. 2013లో ధీర్ సింగ్ కుటుంబానికి చెందిన ఇద్దరిని గజేంద్ర సింగ్ కుటుంబ సభ్యులు చంపారు. అనంతరం గజేంద్ర సింగ్ ఆ ఊరును వదిలి వెళ్లిపోయింది. అయితే ఇటీవలే ఇరు కుటుంబాలు కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నాయి. దీంతో గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబం తిరిగి సొంతూరుకు చేరుకుంది.
గ్రామానికి చేరుకున్న గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబ సభ్యులపై ఇవాళ ఉదయం 10 గంటలకు కర్రలతో దాడి చేశారు ధీర్ సింగ్ తోమర్ కుటుంబ సభ్యులు. అనంతరం వారిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గజేంద్ర సింగ్, ఆయన ఇద్దరు కుమారులు, మరో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు లీపా గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో 8 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

