ఒడిశాలో సింగరేణి అధికారుల పర్యటన

హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఒడిశాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అనుమతుల కోసం సింగరేణి సంస్థ ఉన్నతాధికారుల బృందం సోమ, మంగళవారాల్లో ఆ రాష్ట్రంలో పర్యటించింది. నైనీ బొగ్గు బ్లాకు రెండో దశకు అటవీ భూములు కేటాయించాలని, న్యూ పాత్రపద బొగ్గు బ్లాక్‌కు సంబంధించిన భూసేకరణకు సహకరించాలని ఈ బృందం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఒడిశా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. ఒడిశాలో పర్యటించిన వారిలో సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్, మైనింగ్ అడ్వయిజర్ డీ ఎన్ ప్రసాద్, కోల్‌మూమెంట్ ఈడీ జే ఆల్విన్, నైనీ బ్లాక్ అడ్వయిజర్ విజయరావు, జీఎం ఎం సురేశ్ ఉన్నారు. నైనీ బ్లాకుకు అనుబంధంగా అంగూల్ జిల్లా కేంద్రానికి సమీపంలో సింగరేణి సంస్థ రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన అత్యాధునిక బొగ్గు విశ్లేషణ కేంద్రాన్ని డైరెక్టర్ ఎన్ బలరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారుల బృందం ల్యాబోరేటరీ ప్రాంగణంలో మొకలు నాటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Odisha
- singareni officers
- Tour
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

