బిగ్‌బాస్-13 విజేత కన్నుమూత

- గుండెపోటుతో మృతి?..
- నేడు పోస్టుమార్టం నివేదిక
ముంబై: హిందీ బిగ్‌బాస్-13 విజేత, ప్రముఖ టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా గురువారం చనిపోయారు. ఆయన మరణానికి కారణం ఏమిటన్నది తెలియలేదు. సిద్ధార్థ్ వయసు 40 ఏండ్లు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్లో ‘శివ్’ పాత్ర ద్వారా ఆయన ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. టీవీ షోలతో పాటు అనేక రియాలిటీ షోల్లో కనిపించారు. పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. గురువారం వేకువజామున సిద్ధార్థ్‌కు ఛాతిలో నొప్పి వచ్చినట్టు తెలిసింది. 10.20 గంటల సమయంలో ఆయనను దవాఖానకు తరలించారు. సిద్ధార్థ్ శుక్లాను దవాఖానకు తీసుకువచ్చే సరికే ఆయన చనిపోయారని కూపర్ దవాఖాన డీన్ శైలేష్ చెప్పారు. ‘సిద్ధార్థ్ ఆకస్మిక మరణానికి గల కారణం ఏమిటన్నది పోస్టుమార్టం తర్వాత తెలుస్తుంది’ అన్నారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికను శుక్రవారం విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. భౌతిక కాయాన్ని కూడా కుటుంబసభ్యులకు శుక్రవారం ఉదయమే అప్పగించనున్నారు. అయితే, సిద్ధార్థ్ గుండెపోటుతోనే చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. సిద్ధార్థ్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Mumbai
- Sidharth Shukla
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

