హిందువుల ప్రార్థనల వల్లనే శత్రుత్వం వస్తుందా?… ప్రశ్నించిన ఎంఎస్ఎన్ నేత మహేంద్ర
ముంబై: హిందువుల ప్రార్థనల వల్లనే శత్రుత్వం వస్తుందా? అని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎస్ఎన్) నేత మహేంద్ర భానుషాలి ప్రశ్నించారు. హనుమాన్ చాలీసాను మైక్‌లో వినిపించడం వల్ల ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే చెవులు మూసుకుని ఇళ్లలోనే కూర్చోవాలని అన్నారు. వ్యతిరేకించే వారికి తగిన సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు. మసీదులకు ఎదురుగా రోడ్డుపై ‘హనుమాన్ చాలీసా’ ప్లే చేయాలని పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే శుక్రవారం చెప్పారని, దానిని తాను పాటించినట్లు చెప్పారు.
కాగా, ప్రజల మధ్య శత్రుత్వానికి దారి తీసే విధంగా ప్రవర్తించవద్దని పోలీసులు చెప్పారని మహేంద్ర అన్నారు. అయితే ఎన్నో ఏండ్లగా మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల శత్రుత్వం వచ్చిందా? అని ప్రశ్నించారు. ముంబై పోలీసులు తనకు రూ. 5,050 జరిమానా విధించారని, మళ్లీ ప్లే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసు ఇచ్చారని తెలిపారు. స్వాధీనం చేసుకున్న తన మైక్‌లను తర్వాత ఇస్తామని పోలీసులు చెప్పారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, మసీదుల ముందు పెద్ద లౌడ్ స్పీకర్లలో ‘హనుమాన్ చాలీసా’ ప్లే చేస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం రాజ్ ఠాక్రేను కలిసి జరిగిన విషయాన్ని వివరిస్తానని మీడియాతో అన్నారు.
మరోవైపు ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఒక మసీదు సమీనంలోని ఎంఎస్ఎన్ కార్యాలయం వద్ద ఆదివారం మైకులు ఏర్పాటు చేసి హనుమాన్ చాలీసా ప్లే చేశారు. ఈ సంఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు ఎంఎస్ఎన్ నేత మహేంద్ర భానుషాలిని అదుపులోకి తీసుకున్నారు. మైకులను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.
అయితే మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను వెంటనే తొలగించాలని ఎంఎన్ఎస్ చీప్ రాజ్ ఠాక్రే శనివారం పిలుపునిచ్చారు. లేనిపక్షంలో మసీదుల ఎదురుగా మైకుల్లో హనుమాస్ చాలీసాను ప్లే చేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రలోని అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ నేతలు దీనిపై మండిపడ్డారు.
#WATCH 'Hanuman Chalisa' being played from loudspeakers at the Maharashtra Navnirman Sena office in Mumbai's Ghatkopar
MNS Chief Raj Thackeray yesterday said, "I am warning now…Remove loudspeakers or else will put loudspeakers in front of the mosque and play Hanuman Chalisa." pic.twitter.com/nERn23Vg7M
— ANI (@ANI) April 3, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

