Maharastra elections | ఆదిత్య థాకరేపై మిలింద్ దేవ్రాను బరిలో దింపుతున్న ఏక్నాథ్ షిండే
Maharastra elections | మహారాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరేపై రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రాను బరిలో దించాలని సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ అభ్యర్థిగా ఆదిత్య థాకరే నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఏక్నాథ్ షిండే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
Maharastra elections : మహారాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరేపై రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రాను బరిలో దించాలని సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ అభ్యర్థిగా ఆదిత్య థాకరే నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఏక్నాథ్ షిండే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మిలింద్ దేవ్రా దక్షిణ ముంబై నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏక్నాథ్ షిండే వర్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను మిలింద్ దేవ్రాకు అప్పగించారు. అక్కడ ఆయన సమర్థంగా పనిచేయడంతో వర్లి ఆదిత్య థాకరే సొంత నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉద్ధవ్ థాకరే వర్గం శివసేనకు కేవలం 6,500 మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇప్పుడు వర్లీలో ఆదిత్య థాకరే, మిలింద్ దేవ్రా మధ్య మాత్రమే పోటీలేదు. అక్కడ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కూడా నియోజకవర్గంపై పట్టున్న సందీప్ దేశ్‌పాండేను బరిలో దించింది.
కాగా ఆదిత్య థాకరే గురువారం వర్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా వర్లి ప్రజలు కచ్చితంగా తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
Kavya Maran | వివాహ బంధంలో అడుగుపెట్టిన అనిరుధ్ కావ్య మారన్..
Khaajaguda Land Dispute | ఖాజాగూడ భూదోపిడీలో పెద్దల హస్తం.. రక్షించాల్సిన సర్కారే భక్షిస్తున్న వైనం: దాసోజు శ్రవణ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

