కాళ్లు విరగ్గొట్టండి.. నేను చూసుకుంటా!
శివసేన కార్యకర్తలపై ‘దాడులు చేయండి, చితకబాదండి, కాళ్లు విరగ్గొట్టండి..’ అంటూ తన అనుచరులు, మద్దతుదారులను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే రెచ్చగొట్టాడు. కేసులు ఎదురైతే, తర్వాతి రోజే బెయిల్పై బయటకు తీసుకువస్తానంటూ హామీ కూడా ఇచ్చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది
- శివసేన కార్యకర్తలను వదలొద్దన్న షిండే వర్గ ఎమ్మెల్యే
ముంబై, ఆగస్టు 16: శివసేన కార్యకర్తలపై ‘దాడులు చేయండి, చితకబాదండి, కాళ్లు విరగ్గొట్టండి..’ అంటూ తన అనుచరులు, మద్దతుదారులను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే రెచ్చగొట్టాడు. కేసులు ఎదురైతే, తర్వాతి రోజే బెయిల్పై బయటకు తీసుకువస్తానంటూ హామీ కూడా ఇచ్చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
‘అధికారంలో ఉన్నామన్న సంతృప్తి వద్దు. వారి స్థానమేంటో వారికి చూపించాలి. మనల్ని విమర్శిస్తే సహించేది లేదు. ఎవరైనా ఏమైనా అంటే చితకబాదండి.. ఇక్కడ ప్రకాశ్ సుర్వే కూర్చొని ఉన్నాడు.. వారికి పిప్పిపిప్పి చేయండి’ అని ఎమ్మెల్యే మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉన్నది. ‘ వారి చేతులు విరగ్గొట్టలేకుంటే.. వారి కాళ్లు విరిచేయండి. ఆ తర్వాతి రోజునే మీకు బెయిల్ తీసుకువస్తాను. ఎవరినీ వదలొద్దు’ అని మద్దతుదారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వీడియోపై మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వేను సంప్రదించగా..స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Goons
- mla
- Shinde group
- shiv sena
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

