నదిలోకి స్నానానికి వెళ్లి ఏడుగురు మృతి..
చెన్నై : తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు బాలికలు సహా ఏడుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. నెల్లికుప్పం సమీపంలోని గ్రామాలకు చెందిన మహిళలు, బాలికలు ఆదివారం మధ్యాహ్నం కెడిలం నది ఆనకట్ట సమీపంలోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలోనే నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు.
విషయాన్ని గమనించిన పలువురు స్థానికులు మునిగిన వారందరినీ రక్షించి కడలూరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వారిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుల్లో ఐదుగురు కూచిపాళయానికి చెందిన వారు కాగా.. ఇద్దరు అక్కా చెల్లెల్లు ఆయంకురింజిపాడి గ్రామానికి చెందిన వారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
సమాచారం అందుకున్న మృతుల బంధువులు, కుటుంబం సభ్యులు కడలూరు ప్రభుత్వ దవాఖానకు వద్దకు చేరుకున్నారు. సరదాగా స్నాసానికి వెళ్లి వస్తామని చెప్పి విగతజీవులు కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే, నదిలో స్నానానికి వెళ్లి సమయంలో ఇద్దరు ఈత కొట్టే ప్రయత్నంలో డ్యామ్ సమీపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగిపోగా.. వారిని కాపాడే ప్రయత్నంలో వారిని రక్షించేందుకు వెళ్లి ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

