తిరువనంతపురం : కేరళకు చెందిన సీనియర్ రాజకీయ నేత పీసీ జార్జ్ అరెస్టయ్యారు. లైంగిక వేధింపుల కేసులో ఆయనను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 10న పీసీ జార్జ్ తనను తైక్కాడ్లోని గెస్ట్ హౌస్‌కు పిలిచి, అక్కడ తనపై లైంగిక దాడికి యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజకీయ నేతనుంచి తనకు అశ్లీల మెస్సేజ్‌లు వస్తున్నాయని ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు మ్యూజియం పోలీసులు పీసీ జార్జ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను ఏఆర్ క్యాంపునకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఆయనపై పోలీసులు 354,354(A) అభియోగాలు మోపారు.