వీరప్పన్‌ను మట్టుబెట్టిన ఆ పోలీస్ అధికారి రాజీనామా
IPS Vijay Kumar: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ సాయంతో మట్టుబెట్టిన సీనియర్ పోలీస్ అధికారి విజయ్ కుమార్ తన పదవికి
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ సాయంతో మట్టుబెట్టిన సీనియర్ పోలీస్ అధికారి విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారుగా ఉన్న ఆయన.. వ్యక్తిగత కారణాలవల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. తన సర్వీసు పొడుగూత మంచి సహకారం అందించినందుకు.. ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌కు, హోంశాఖ అధికారులకు, వివిధ రాష్ట్రాల పోలీస్ చీఫ్‌లకు విజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విజయ్‌కుమార్.. తన పనితీరుతో పోలీస్ డిపార్టుమెంట్లో అంచెలంచెలుగా ఎదిగారు. కశ్మీర్లో బీఎస్ఎఫ్ ఐజీగా, చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. గంధపు చెక్కల దొంగ వీరప్పన్‌ను మట్టుబెట్టడానికి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు చీఫ్‌గా పనిచేసి.. పక్కా ప్లాన్ వీరప్పన్‌ను అంతం చేశారు. జమ్ముకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుంచి కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

