రోజుకో సూర్యుడు హాంఫట్!
విశ్వంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఓ కృష్ణబిలాన్ని (బ్లాక్‌హోల్‌ను) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓ క్వాసర్ (అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం లాంటి వస్తువు) మధ్యలో ఉన్న ఈ కృష్ణబిలం ప్రతిరోజూ సూర్యుడి పరిమాణానికి సమానమైనంత పదార్ధాన్ని మింగేస్తున్నట్టు గుర్తించారు.
- విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన క్వాసర్ గుర్తింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: విశ్వంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఓ కృష్ణబిలాన్ని (బ్లాక్‌హోల్‌ను) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓ క్వాసర్ (అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం లాంటి వస్తువు) మధ్యలో ఉన్న ఈ కృష్ణబిలం ప్రతిరోజూ సూర్యుడి పరిమాణానికి సమానమైనంత పదార్ధాన్ని మింగేస్తున్నట్టు గుర్తించారు. భూగోళానికి 1,200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ క్వాసర్ సూర్యుని కంటే 500 లక్షల కోట్ల రెట్లు అధికంగా ప్రకాశిస్తున్నదని, విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసర్ ఇదేనని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) పరిశోధకులు వెల్లడించారు.
ఆ క్వాసర్లోని బ్లాక్‌హోల్ సూర్యుని కంటే 1,700 కోట్ల రెట్లు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉన్నదని, ఇది అత్యంత వేగంగా ఎదుగుతుండటంతో తీక్షణమైన కాంతి, వేడి విడుదల అవుతున్నదని వివరించారు. సుడులు తిరుగుతున్న వాయువులు, 10 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ఆ బ్లాక్‌హోల్ చుట్టుపక్కల ప్రాంతం భారీ అయస్కాంత తుపానులా కనిపిస్తున్నదని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఏఎన్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్ క్రిస్టియన్ ఉల్ఫ్ తెలిపారు. శాస్త్రవేత్తలు తొలుత న్యూ సౌత్‌వేల్స్‌లోని ఏఎన్‌యూ సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీ వద్ద ఉన్న 2.3 మీటర్ల టెలిస్కోప్ సాయంతో ఈ కృష్ణబిలాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఆ బ్లాక్‌హోల్ పూర్తి స్వభావాన్ని నిర్ధారించడంతోపాటు దాని ద్రవ్యరాశిని కొలిచేందుకు చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీలో ఉన్న టెలిస్కోప్‌ను ఉపయోగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

