Manipur | 13 రోజుల తర్వాత.. మణిపూర్‌లో మళ్లీ తెరచుకున్న స్కూళ్లు, కాలేజీలు
కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్‌లో (Manipur) క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో భారీగా సైనికులను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఈ నేపథ్యంలో ఇంఫాల్, జిరిజామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకున్నాయి.
ఇంఫాల్: కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్‌లో (Manipur) క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో భారీగా సైనికులను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఈ నేపథ్యంలో ఇంఫాల్, జిరిజామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకున్నాయి. శుక్రవారం నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభింస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. దీంతో ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా నిరుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌లో ఈ నెల 16న మళ్లీ హింస చెలరేగింది.

అల్లరి మూకలు మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లకు నిప్పంటించాయి. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటిపై దాడి చేయడానికి యత్నించాయి. కర్ఫ్యూ విధించినా ఇండ్లను దగ్ధం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇంఫాల్ లోయ (Imphal Valley)లో తీవ్ర అశాంతి నెలకొంది. దీంతో ఇంఫాల్ వ్యాలీలోని 5 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను నవంబర్ 23 వరకు మూసివేసి ఉంచుతామని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కక్చింగ్ జిల్లాలలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతబడి ఉంటాయని చెప్పారు. దానిని శుక్రవారం వరకు పొడిగించారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా సైన్యాన్ని మోహరించింది. దీంతో కేంద్ర బలగాల మొత్తం కంపెనీల సంఖ్య 288కు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

