Satyendar Jain: మెడికల్ గ్రౌండ్స్‌పై సత్యేందర్ జైన్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరీ
Satyendar Jain: జస్టిస్ జేకే మహేశ్వరి, పీఎస్ నర్సింహలతో కూడిన ధర్మాసనం మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. జూలై 11వ తేదీ వరకు బెయిల్ అమలులో ఉంటుంది. ఆ సమయంలో ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు అని ఇవాళ ధర్మాసనం తెలిపింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్(Satyendar Jain)కు సుప్రీంకోర్టు ఇవాళ తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. మెడికల్ గ్రౌండ్‌పై ఆ బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు చెప్పింది. ఆరోగ్యం క్షీణించిన జైన్ ప్రస్తుతం ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్ ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆరు వారాల పాటు బెయిల్ మంజూరీ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. అయితే కొన్ని షరతులు విధించింది. బెయిల్ తీసుకున్న సమయంలో సత్యేందర్ జైన్.. మీడియాతో మాట్లాడరాదు అని, ఢిల్లీ విడిచి వెళ్లరాదు అని ఆదేశించింది.
తీహార్ జైలులోని బాత్రూంలో గురువారం ఉదయం మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కుప్పకూలిన ఆయన్ను అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్సను అందించేందుకు ఎన్జేపీ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అందించారు.
ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సత్యేందర్ జైన్‌ను ఆస్పత్రికి తీసుకురావడం ఈ వారంలో ఇది రెండవసారి. గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో సెల్ నెంబర్ 7లోని బాత్రూంలో జైన్ కుప్పకూలారని తీహార్ జైల్ డీజీ తెలిపారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. సత్యేందర్ జైన్‌కు వెన్నెముక సర్జరీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.
మనీ ల్యాండరింగ్ కేసులో గత ఏడాది ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పటి నుంచి మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. జస్టిస్ జేకే మహేశ్వరి, పీఎస్ నర్సింహలతో కూడిన ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. జూలై 11వ తేదీ వరకు బెయిల్ అమలులో ఉంటుంది. ఆ సమయంలో ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు అని ఇవాళ ధర్మాసనం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

