Gujarat Riots | ఉద్దేశపూర్వకంగానే గుజరాత్ అల్లర్లు.. మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
Gujarat Riots | గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ కూతురు ఆకాశీ భట్ అన్నారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డ్యాకుమెంటరీపై ఈ నెల 7న వాషింగ్టన్లో నేషనల్ ప్రెస్ క్లబ్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ నిర్వహించిన ప్యానెల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
Gujarat Riots | వాషింగ్టన్, మార్చి 10: గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ కూతురు ఆకాశీ భట్ అన్నారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డ్యాకుమెంటరీపై ఈ నెల 7న వాషింగ్టన్లో నేషనల్ ప్రెస్ క్లబ్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ నిర్వహించిన ప్యానెల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘జైలు పాలు చేస్తారని లేదా చంపుతారనే భయం లేకుండా అమెరికా జర్నలిస్టులు స్వేచ్ఛగా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలి. అమెరికా ప్రభుత్వానికి కూడా ఇదే వర్తిస్తుంది.
మోదీకి అమెరికా అధ్యక్షుడు ఎందుకు స్వాగతం పలకాలి?’ అని ఆకాశీ అన్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ ఏడాదిలో మోదీ బైడెన్‌తో వైట్ హౌస్‌లో చర్చలు జరిపే అవకాశం ఉన్నది. గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర ఉన్నదని నిరూపించడానికి తన తండ్రి ఒంటరి పోరాటం చేస్తున్నారని, అకారణంగా ఆయనను అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆకాశీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘భారత న్యాయవ్యవస్థ పని చేయడం లేదు. దాన్ని పూర్తిగా కూల్చేశారు. మోదీ పాలనకు ప్రయోజనం కలిగించేలా దాన్ని మార్చేశారు’ అని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Gujarat
- Gujarat riots
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

