UP Polling | పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ పెట్టండి : ఈసీకి సమాజ్‌వాదీ లేఖ
సమాజ్‌వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఆ లింక్‌ను ఈసీకి, చీఫ్ ఎన్నికల కమిషనర్‌కి, పోలింగ్ అధికారులకు, రాజకీయ పార్టీలకు షేర్ చేయాలని కూడా ఆ లేఖలో డిమాండ్ చేసింది. ఇలా చేస్తే కౌంటింగ్ ప్రక్రియను రాజకీయ పార్టీలు లైవ్‌గా చూసినట్లు ఉంటుందని, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా కూడా జరిగినట్లు ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ ఆ లేఖలో అభిప్రాయపడింది.
సమాజ్‌వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను ఎత్తుకెళ్తున్నారని ఆరోపించారు. ఎలాంటి నిబంధనలను పాటించకుండానే.. అభ్యర్థుల అనుమతి లేకుండా ఈవీఎంలను వేరేచోట్లకు తరలించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఈవీఎంలను పట్టుకోగానే, అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. ‘బీజేపీ ఓడిపోయే స్థానాల్లో కౌంటింగ్ నెమ్మదిగా జరిగేలా చూడాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ (పీఎస్) నుంచి ఆదేశాలు వెళ్లినట్టు మాకు సమాచారం ఉన్నది’ అని అఖిలేశ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

