ఉద్యోగం నుంచి ప్రొఫెసర్ సాయిబాబా తొలిగింపు

ఢిల్లీ వర్సిటీ కళాశాల ఆదేశాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: మావోయిస్టులతో సంబంధాలు కలిగిఉన్నారన్న ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్టు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్‌లాల్ ఆనంద్ కాలేజీ యాజమాన్యం శనివారం వెల్లడించింది. ఈ మేరకు సాయిబాబా భార్య వసంతకు గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీచేశారు. మార్చి 31, 2021 నుంచి సాయిబాబాను సర్వీసుల నుంచి తొలిగిస్తున్నట్టు, అలాగే మూడు నెలల వేతనాన్ని కూడా ఇస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై వసంత స్పందిస్తూ.. ఇది ఒక ఉద్యోగి హక్కులను కాలరాయడమేనని ధ్వజమెత్తారు. దీనిపై కోర్టులో సవాల్ చేస్తామన్నారు. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో సాయిబాబాను 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నాగ్‌పూర్ కేంద్ర కారాగారంలో ఆయన జీవితఖైదు అనుభవిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
దీదీ.. మీరు వారణాసిలో పోటీ పడొచ్చు!
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- delhi versity
- Maoists
- saibaba
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

