Nikki Yadav Murder Case | సహజీవనం కాదు.. వారికి ఇదివరకే పెళ్లైంది.. నిక్కీ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!
ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ఏరియాలో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన నిక్కీ యాదవ్ (Nikki Yadav).. హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిది సహజీవనం కాదని.. వివాహ బంధమే అని తాజాగా పోలీసులు వెల్లడించారు.
Nikki Yadav Murder Case | ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ఏరియాలో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన నిక్కీ యాదవ్ (Nikki Yadav).. హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాహిల్ గెహ్లోత్ (Sahil Gehlot).. ఛార్జింగ్ కేబుల్ (charging cable)తో నిక్కీ మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు పోలీసు విచారణలో ఇప్పటికే వెల్లడైంది. అయితే వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని.. తనని కాదని సాహిల్ వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుందంటూ ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తాజాగా పోలీసులు వెల్లడించారు.
నిక్కీ-సాహిల్‌కు 2020 అక్టోబర్‌లోనే వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా (Noida)లోని ఆర్యసమాజ్ (Arya Samaj temple)లో వీరి వివాహం జరిగినట్లు చెప్పారు. వీరి వివాహ ధ్రువపత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే వీరి పెళ్లి సాహిల్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని పోలీసులు తెలిపారు. నిక్కీ హత్యలో సాహిల్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు పాత్ర కూడా ఉందని విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడి తండ్రి వీరేంద్ర సింగ్, సోదరులు అనీష్, నవీన్, స్నేహితులు లోకేశ్, అమర్‌ను శుక్రవారం సాయంత్రం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు (Delhi Police Crime Branch ) అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగిందంటే..?
నిక్కీ యాదవ్ (23).. సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. తాజాగా అది సహజీవనం కాదు.. వారికి ఇదివరకే వివాహం జరిగిందని పోలీసు విచారణలో వెల్లడైంది. అయితే సాహిల్ గెహ్లాట్.. నిక్కీని కాదని మరో యువతితో పెండ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న నిక్కీ.. సాహిల్‌ని నిలదీసింది. ఈ విషయమై తమ ఫ్లాట్‌కు సమీపంలోనే కారులో ఇద్దరూ గొడవపడ్డారు. దాదాపు మూడు గంటలపాటు వారి గొడవ జరిగింది.
ఈ క్రమంలో గొడవ ముదరడంతో సాహిల్ డాటా కేబుల్‌తో నిక్కీ మెడకు ఉరి బిగించి చంపేశాడు. అయితే, హత్య అనంతరం మృతదేహాన్ని ఏం చేయాలో తెలియయ స్నేహితుల సాయంతో అదే కారులో వారి దాబాకు తీసుకెళ్లాడు. అక్కడ ఫ్రిడ్జ్‌లో దాన్ని దాచేశాడు. కారులో గొడవను గమనించిన పక్క ఫ్లాట్ వ్యక్తి నిక్కీ యాదవ్ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా సాహిల్ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

