ముంబై : క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనకిష్టమైన వంటకాలు, టూర్లు సహా పలు వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. సచిన్ ఇన్స్టాగ్రాం ఖాతాలో ఎన్నో ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.
ఇక సచిన్ తాజాగా తన రెండు పెంపుడు కుక్కలతో ఉల్లాసంగా గడిపిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెట్ డాగ్స్ సైతం సచిన్ కంపెనీని ఆస్వాదించాయి. ఈ రెండు లేకుండా హౌస్ ఓ ఇల్లు అనిపించుకోదని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోకు నెటిజన్ల నుంచి లవ్ ఎమోజీలతో అనూహ్య స్పందన లభించింది. సచిన్ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌తో పాటు సురేష్ రైనా, రాజ్‌పాల్ యాదవ్ సహా పలువురు ఈ పోస్ట్‌పై కామెంట్ చేశారు. ఇక ఈ ఏడాది జనవరిలో సచిన్ టెండూల్కర్ తన పెంపుడు కుక్కలను ఫ్యాన్స్‌కు పరిచయం చేస్తూ ఓ వీడియో షేర్ చేశారు.