మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం

తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని మాస పూజల కోసం శుక్రవారం తెరిచారు. ప్రధాన పూజారి వీకే జయరాజ్ పొట్టి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తాంత్రి కందారు మహేష్ మోహనారు సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఆలయాన్ని తెరిచారు. కార్కిదకం మలయాళ మాసం నేపథ్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ఈ నెల 21 వరకు ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా స్లాట్లు నమోదు చేస్తున్న 5000 వేల మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం 48 గంటలు ముందుగా చేయించుకున్నఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించిన భక్తులను మాత్రమే ఆలయంలోకి ప్రవేశానికి అనుమతిస్తామని బోర్డు వెల్లడించింది. మరోవైపు నీలక్కల్లో కరోనా పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ గడువు చెల్లిన వారికి కరోనా పరీక్ష చేస్తారు. పాజిటివ్ వచ్చిన వారిని పెరునాడులోని ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

