ఐటీ నిబంధనలు పాటించాల్సిందే.. ట్విట్టర్‌కు స్థాయీ సంఘం ఆల్టిమేటం
ఐటీ నిబంధనలు పాటించాల్సిందే.. ట్విట్టర్‌కు స్థాయీ సంఘం ఆల్టిమేటం| తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు స్థానిక చట్టాలను అమలు ....

న్యూఢిల్లీ: తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు స్థానిక చట్టాలను అమలు చేయాల్సిందేనని మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. కంపెనీ పాలసీల కంటే స్థానిక చట్టాలు పాటించడమే శిరోధార్యం అని ఉద్ఘాటించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అధ్యక్షతన శుక్రవారం పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరిగింది.
నూతన ఐటీ నిబంధనల అమలుపై కేంద్రానికి, ట్విటర్‌కు మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, ఈ సమావేశానికి హాజరైన ట్విట్టర్ ప్రతినిధులు అస్పష్ట సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది.

దేశీయ చట్టాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని స్థాయీ సంఘం ట్విట్టర్‌ను గట్టిగా ప్రశ్నించినట్లు వినికిడి. కొద్ది రోజులుగా కేంద్రానికి, ట్విటర్‌కు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
గడువులోగా కొత్త ఐటీ నిబంధనలను ట్విటర్ పాటించకపోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు టూల్‌కిట్ వ్యవహారం, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖల ఖాతాలకు బ్లూ టిక్ తొలగింపు అంశాలు ఈ దూరాన్ని మరింతగా పెంచిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

