Bank Robbery: క్యాషియర్‌ను కత్తితో బెదిరించి.. ఎస్బీఐ బ్యాంకులో 6.5 లక్షలు ఎత్తుకెళ్లాడు
Bank Robbery: బ్యాంకులో క్యాషియర్‌ను బెదిరించి 6.5 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన ఏపీలోని నర్సాపురం ఎస్బీఐ బ్రాంచీలో జరిగింది. బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫూటేజ్ రిలీజ్ చేశారు.
నర్సాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్బీఐ బ్రాంచీలో పగటిపూటే దోపిడీ(Bank Robbery) జరిగింది. నర్సాపురం పట్టణంలో ఉన్న ఆ బ్రాంచీలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో క్యాష్ ఆఫీసర్‌ను బెదిరించి 6.5 లక్షలు ఎత్తుకెళ్లాడు. మాస్క్ పెట్టుకుని వచ్చిన ఆ వ్యక్తి మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాషియర్‌ను బెదిరించి డబ్బుతో ఉడాయించాడు. క్యాష్ ఆఫీసర్ రూమ్‌కు నేరుగా వచ్చిన ఆ వ్యక్తి.. గోల్డ్ లోన్ కావాలన్న నెపంతో ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత దాచుకున్న కత్తిని తీసి ఆ ఆఫీసర్‌ను బెదిరించాడు. 6.5 లక్షల నగదుతో పరారీ అయినట్లు నర్సాపురం పోలీసు ఆఫీసర్ కే రవి మనోహరా చారి తెలిపారు.
దోపిడీ చేసిన వ్యక్తి మాస్క్‌తో పాటు తలకు టోపీ పెట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. తన ఐడెంటిటీని దాచి పెట్టుకునేందుకు అతను క్యాప్‌తో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. జోయ్సులా వీధి ఎస్బీఐ బ్యాంకులో దోపిడి చేయడానికి ముందు నిందితుడు మూడు గంటల పాటు రెక్కీ గీసినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.
బ్యాంకులో దోపిడీ జరిగిన సమయంలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్యాష్ ఆఫీసర్, అటెండెంట్‌తో పాటు మరో మహిళా ఆఫీసర్ తన క్యాబిన్లో ఉన్నారు. ఆ సమయంలో బ్యాంకు మేనేజర్ బ్యాంకులో లేరు. దోపిడీ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐపీసీ 392 సెక్షన్ కింద కేసు బుక్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

