Rajnath Singh: అగ్నివీర్ చనిపోతే కోటి పరిహారం ఇస్తున్నాం: రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh: ఎవరైనా అగ్నివీర్ చనిపోతే, ఆ కుటుంబానికి కోటి నష్టపరిహారం ఇస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లోక్‌సభలో మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. తప్పుడు ఆరోపణలతో సభను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఎవరైనా అగ్నివీర్ చనిపోతే, వాళ్ల కుటుంబానికి కోటి నష్టపరిహారం ఇస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) తెలిపారు. లోక్‌సభలో మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. తప్పుడు ఆరోపణలతో సభను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆర్మీకి వ్యతిరేకంగా అగ్నివీర్ స్కీమ్ ఉందన్నారు. దేశభక్తులు కూడా ఆ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.
ఓ అగ్నివీర్ .. ల్యాండ్‌మైన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడని, అతన్ని తాను అమరుడిగా పిలుస్తానని, కానీ ఈ ప్రభుత్వం పిలవడం లేదని, ఆ వీరుడి కుటుంబానికి ఎటువంటి లబ్ధి చేకూరడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ జోక్యం చేసుకున్నారు. యాక్షన్‌లో ఉన్న అగ్నివీర్ చనిపోతే కోటి సాయాన్ని ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. తప్పుడు స్టేట్మెంట్లతో సభను తప్పుదోవ పట్టించవద్దు అని పేర్కొన్నారు.
బోర్డర్‌ను రక్షిస్తున్న సమయంలో కానీ, యుద్ధంలో కానీ ఎవరైనా అగ్నివీర్ తన ప్రాణాలను కోల్పోతే అప్పుడు ఆ కుటంబానికి పరిహారం ఇస్తున్నట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు.
Objecting to LoP Rahul Gandhi’s statement, Defence Minister Rajnath Singh says, “He Rahul Gandhi) should not try to mislead the House by making wrong statements. Financial assistance of Rs one crore is given to the family of the Agniveer who sacrifices his life while protecting… https://t.co/gJLaQLFdiO
— ANI (@ANI) July 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

