Road Hypnosis | హైవేలపై యాక్సిడెంట్స్ జరగడానికి ప్రధాన కారణం రోడ్ హిప్నాసిస్.. ఇది ఎలా అవుతుంది?
Road Hypnosis | రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండిషన్ సరిగ్గా లేకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కునుకు పడటం, రోడ్లు అధ్వానంగా ఉండటం కారణాలుగా భావిస్తుంటారు. అయితే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉన్న రోడ్లపై కూడా ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాన్ని పరిశీలించినప్పుడు పలు ప్రమాదాలకు ‘రోడ్ హిప్నాసిస్' సమస్య కారణమని నిపుణులు అంటున్నారు.
Road Hypnosis | ముంబై: రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండిషన్ సరిగ్గా లేకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కునుకు పడటం, రోడ్లు అధ్వానంగా ఉండటం కారణాలుగా భావిస్తుంటారు. అయితే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉన్న రోడ్లపై కూడా ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాన్ని పరిశీలించినప్పుడు పలు ప్రమాదాలకు ‘రోడ్ హిప్నాసిస్’ సమస్య కారణమని నిపుణులు అంటున్నారు.
రోడ్ హిప్నాసిస్ అంటే.. వాహనం నడుపుతున్న వ్యక్తి కండ్లు చూస్తున్న విషయాలను బ్రెయిన్ గుర్తించదు, విశ్లేషించదు. దీంతో కండ్లు తెరిచి ఉండగానే ప్రమాదం చేస్తాడు. అయితే తాను ఆ స్థితిలో ఉన్నట్టు ఆ వ్యక్తి కూడా గ్రహించలేడు. ఆరోగ్య నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇలాంటి స్థితి లాంగ్‌డ్రైవ్‌లో, ముఖ్యంగా ఎలాంటి మలుపులు లేని రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏర్పడుతుంది. సిగ్నల్ లైట్లు, ట్రాఫిక్ లేకపోవడం.. చాలా దూరం అదే రోడ్డు కనపడుతున్నప్పుడు సంభవిస్తుందని తెలియజేస్తున్నారు. ముంబై-నాగఫూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన చాలా ప్రమాదాలు రోడ్ హిప్నాసిస్ వల్లే జరిగినట్టు మహారాష్ట్ర స్టేట్ హైవే పోలీసులు నిర్థారించారు. ఈ హైవే ప్రారంభమైన నాలుగు నెలల వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో 39 మంది మృతిచెందారు. దీంతో అధికారులు ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు, వాహనదారులు రోడ్ హిప్నాసిస్‌కు గురికాకుండా సైన్, మెసేజ్ బోర్డులు ఏర్పాటు వంటి చర్యలు తీసుకొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

